బెట్టింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం: కమిషనర్

బెట్టింగ్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతాం: కమిషనర్

కృష్ణా: బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. సులభంగా డబ్బు వస్తుందనే మాయలో పడవద్దు. బెట్టింగ్ వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ స్తిరత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడతాయని పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు హెచ్చరించారు. బెట్టింగ్‌లో పాల్గొన్న, నిర్వహించినా, ప్రోత్సహించినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బెట్టింగ్ సమాచారాన్ని డయల్ 100 లేదా 112 నంబర్లకు తెలియజేయాలని కోరారు.