VIDEO: ఆదిత్య విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై AISF ఆందోళన
VSP: ద్వారకనగర్‌లో మంగళవారం AISF ఆధ్వర్యంలో ఆదిత్య కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ.. కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులకు మించి మూడు రెట్లు వసూలు చేస్తున్నారని తెలిపారు.