మైనర్‌పై లైంగిక దాడి కేసులో 25 ఏళ్ల శిక్ష

HYD: 2022లో మంగళహాట్ PS పరిధిలో బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి శిక్ష పడింది. మోతుకారి సత్యనారాయణాచారి అలియాస్ చిన్నకు నాంపల్లి మూడవ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిత 25 ఏళ్ల కఠిన శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసు ACP గోషామహల్ విభాగం & DCP సౌత్ వెస్ట్ జోన్ పర్యవేక్షణలో విచారణ సాగింది.