ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులపై ప్రత్యేక రాయితీలు
E.G: రాజమండ్రి నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి & ఖాళీ స్థలాల పన్నులపై ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా ఇవాళ తెలిపారు. 2025-26 వరకు ఉన్న పన్ను బకాయిలను ఒకేసారి చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ కలుగుతుందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందుగానే పన్ను చెల్లిస్తే 5% రిబేట్ లభిస్తుందన్నారు. ఈ అవకాశం ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమేనన్నారు.