పోలీసులతో పేర్ని కిట్టు వాగ్వాదం

పోలీసులతో పేర్ని కిట్టు వాగ్వాదం

AP: మచిలీపట్నం పోలీసులపై YCP నేత పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు విరుచుకుపడ్డారు. కొబ్బరితోట ప్రాంతంలో ఓ ఇంటిని అధికారులు కూల్చివేస్తున్నారని తెలుసుకున్న కిట్టు అక్కడికి చేరుకుని అడ్డుకోబోయారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. 'మీరు చేసే పనులకు మీకు మర్యాద ఇవ్వడమే ఎక్కువ' అంటూ CI సహా అక్కడ ఉన్న పోలీసులపై రెచ్చిపోయారు.