గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

JGL: మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. కొన్ని రోజులుగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మద్యానికి బానిసై బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని గురించి, కుటుంబ సభ్యుల సమాచారం తెలిస్తే మల్లాపూర్ పోలీసులకు తెలపాలన్నారు.