ఆంజనేయ స్వామి ఆలయంలో దీపోత్సవం

NRPT: మరికల్ మండలంలోని ఎట్లాస్పూర్ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదివేల దీపోత్సవాలను వైభవంగా వెలిగించారు. ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం దీపాలను వెలిగించి భక్తులు దీపోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.