శ్రీ రామ నవమి రోజు 'ఉడుత' భక్తి
BDK: ఇల్లందులో ఓ ఉడుత చేసిన పని అందరినీ ఆకట్టుకుంటుంది. నాగుల్ మీరా దర్గాలో హిందూ-ముస్లింలు కలిసి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాములోరి కోసం పెట్టిన ఫలహారాలను ఉడుత భుజించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఏటా దర్గాలో జరిగే శ్రీరామనవమి కళ్యాణ వేడుకల్లో ఉడుత వచ్చి ఇలానే ఫలహారం స్వీకరిస్తుందని స్థానికులు తెలిపారు.