బేతిగల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బేతిగల్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

KNR: వీణవంక మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఆదివారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సర్పంచ్ చొప్పరి సారమ్మ ప్రారంభించారు. గ్రామస్థుల సౌకర్యార్థం అంతర్గత రహదారులను మెరుగుపరుస్తున్నామని, నాణ్యతతో పనులను పూర్తి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మడ్డి మహేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.