రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

KMM: దమ్మపేటలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పారావుపేటకు వెళ్లే రహదారిపై బైకును ప్లాస్టిక్ బాటిల్ లోడ్‌తో వెళ్తేన్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అటు లారీ బోల్తా పడటంతో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.