'ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలి'

'ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలి'

NLG: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఎస్సై మామిడి రవికుమార్ అన్నారు. చిట్యాల మండలం సుంకేనపల్లి గ్రామాన్ని గురువారం సాయంత్రం సందర్శించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి కొట్లాటలకు పోకుండా ప్రజలందరూ సామరస్యంతో మెలగాలని సూచించారు. ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలన్నారు.