కేజీబీవీలో స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమం
JN: జనగామ మండలం చౌడారం కేజీబీవీలో విద్యార్థినులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. కెప్టెన్ సుంకరి మాధవి ఆధ్వర్యంలో విద్యార్థినులు టెంట్ల ఏర్పాటు, మొక్కలు నాటడం వంటి అంశాల్లో ఆచరణాత్మక శిక్షణ పొందారు. క్రమశిక్షణతో కూడిన జీవనం, సేవా దృక్పథం అలవరచుకోవడంలో ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.