VIDEO: గుంతల మయంగా రోడ్డు.. వాహనదారుల ఇబ్బందులు

VIDEO: గుంతల మయంగా రోడ్డు.. వాహనదారుల ఇబ్బందులు

HYD: అంబర్‌పేట్ గాంధీ బొమ్మ ఫ్లై ఓవర్ కింద రోడ్డు అద్వానంగా మారిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డుపై నిత్యం వాహనదారులు అధిక సంఖ్యలో రాకపోకలు కొనసాగిస్తుంటారని, రోడ్డు గుంతల మయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. గుంతల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.