సుప్రీం ఆదేశాలు.. వీధి కుక్కలపై చర్యలు

AP: రాష్ట్రంలో వీధి కుక్కల సమస్యపై చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా వీధి కుక్కల సంఖ్య, కదలికలు వంటి అంశాలను రియల్ టైమ్‌లో పరిశీలించేందుకు ప్రత్యేక డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.50 లక్షలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అంచనా వేసింది. వీటి నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.