వాజ్‌పేయీకి తెలుగు జాతి రుణపడి ఉంది: లోకేష్
AP: మాజీ ప్రధాని వాజ్‌పేయీ అంటే తనకు ప్రత్యేక అభిమానమని మంత్రి లోకేష్ అన్నారు. ఆయన అవినీతి మచ్చలేని నేత అని కితాబిచ్చారు. విలువల కోసం ప్రధాని పదవిని సైతం వదులుకున్నారని తెలిపారు. చంద్రబాబు, వాజ్‌పేయీకి తండ్రికుమారుల వంటి అనుబంధం ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో సహకారం అందించారని, తెలుగు జాతి ఆయనకు రుణపడి ఉందన్నారు.