టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు మండలం ఐ. పంగిడిలో టీడీపీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం టీడీపీ సీనియర్ నాయకులు అచ్చిబాబుతో కలిసి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుతో మంచి పాలన అందిస్తుందన్నారు. ఇకపై పంగిడి కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.