సాగర్ ఎడమ కాలువలో గుర్తుతెలియని మృతదేహం
SRPT: మునగాల మండల పరిధిలోని సాగర్ ఎడమ కాలువలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇవాళ వ్యవసాయ పనుల నిమిత్తం కాలువ వద్దకు వెళ్లిన స్థానిక రైతులు, నీటిలో మృతదేహం తేలియాడుతుండటం గమనించారు. వెంటనే రైతులు ఈ విషయాన్ని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.