జిల్లాలో BRS కార్యకర్తల ముఖ్య సమావేశం
ములుగు జిల్లా BRS పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా BRS ఇంఛార్జ్ నాగజ్యోతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ బాకీ కార్డ్ ద్వారా ప్రజలకు వివరించాల్సిందిగా కార్యకర్తలను కోరారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు BRS వైపు మొగ్గు చూపుతారన్నారు.