జవహర్ నగర్‌లో జీరో డ్రంక్ అండ్ డ్రైవ్
MDCL: జవహర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాకపోవడంపై పోలీసులు వాహనదారులను ప్రశంసించారు. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు నిర్వహించిన తనిఖీలకు సంబంధించిన రిపోర్టును విడుదల చేశారు. ఏ ఒక్కరు మద్యం సేవించి వాహనం నడపలేదన్నారు. ఇదేవిధంగా కొనసాగాలని సూచించారు.