పాలకుర్తి మండలంలో 12 నామినేషన్ క్లస్టర్లు

పాలకుర్తి మండలంలో 12 నామినేషన్ క్లస్టర్లు

JN: పాలకుర్తి మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా 3వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ కోసం మండలంలోని 38 గ్రామపంచాయతీలకు 12 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు MPDO వేదవతి తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రాలలోనే నామినేషన్లు వేయాలని సూచించారు.