బ్లాస్ట్ కేసు.. మరో ముగ్గురు అరెస్ట్
ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురు డాక్టర్లను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరూ అల్ ఫలాహ్ వర్సటీకి చెందిన వారిగా గుర్తించారు. వీరు ఢిల్లీ బాంబర్ డాక్టర్ ఉమర్ నబీతో పాటు డాక్టర్ ముజిమ్మిల్ గన్‌తో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఒకరు పేలుడు జరిగిన రోజు ఢిల్లీలో ఉన్నట్లు తెలిపారు.