మేము చేపలకు వ్యతిరేకం కాదు: బీజేపీ
చేపలు తినడంపై దీదీ చేస్తున్న ఆరోపణలపై బెంగాల్ బీజేపీ అప్రమత్తమైంది. ఆహారపు అలావాట్లకు తమ పార్టీ వ్యతిరేకం కాదని వెల్లడించింది. ఈ మేరకు బీదాన్ నగర్ బీజేపీ అభ్యర్థి శరద్వాత్ ముఖర్జీ ఓ పెద్ద చేపను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. తాము చేపలు, మాంసం తింటామని.. అధికారంలోకి వస్తే వీటిపై ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేశారు. తమ పార్టీకి శాకాహారాన్ని ప్రోత్సహించే ఉద్దేశం లేదన్నారు.