ముంబై విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టివేత
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయిని పట్టుకున్నారు. రూ.39 కోట్ల విలువ చేసే 39 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.