2 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

2 ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

BHNG: వలిగొండ మండల కేంద్రంలోని మూసీ వాగు నుంచి వలిగొండకు చెందిన ఉండాడి ఆంజనేయులు, గొలుసుల అశోక్ ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యుగంధర్ తెలిపారు.