ఇవి రేవంత్ రెడ్డి కుట్రలు: BRS MLC
TG: HYDలోని తన ఇంట్లో పోలీసులు చేస్తున్న సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలా బెదిరించడం దుర్మార్గం అని అన్నారు. 'ఇవి ఎన్నికలు కావు.. రేవంత్ చేస్తున్న కుట్రలు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ చేసుకోవడానికి బహిరంగంగా బరితెగిస్తున్నారు. ఈ దౌర్జన్యంపై ఎన్నికల సంఘం స్పందించాలి' అని మండిపడ్డారు.