VIDEO: 'రోడ్డుపై అడ్డగోలుగా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు'
కోనసీమ: రోడ్డుపై అడ్డగోలుగా వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామచంద్రపురం ఎస్సై నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రామచంద్రపురం పట్టణంలోని ప్రధాన రహదారిపై వాహనాల పార్కింగ్ విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.