VIDEO: 'గిరిజన గ్రామాలకు రోడ్డులు, వంతెనలు నిర్మించాలి..!
ADB: తలమడుగు మండలంలోని గిరిజన గ్రామాలైన రేకులగూడ, లాల్గడా తదితర గ్రామాలకు వెళ్లే మార్గంలో సరైన రోడ్డులు, వంతెనలు లేక గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షాలకు వాగులోకి నీరు అధికంగా చేరి ప్రవహిస్తుండడంతో గిరిజన గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సి వస్తోంది. రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.