మధాపురంలో రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమం

JN: రాష్ట్రీయ బాల్ స్వస్థ్య కార్యక్రమం (RBSK)లో బాగంగా దేవరుప్పుల మండలం మాధాపురం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు సోమవారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వైద్యులు ఆరోగ్య తనిఖీలు చేసి అవసరమైన సూచనలు అందించారు. చిన్నారుల శారీరక ఆరోగ్యం, దంతాలు, కళ్ళు, రక్తపోటు, పోషకాహారం వంటి అంశాలను పరిశీలించారు.