నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎస్సై రమేష్ బాబు

MHBD: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీస్ స్టేషన్ ఆవరణలో కల్లు గీత కార్మిక సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎస్ఐ రమేష్ బాబు ఇవాళ ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం సత్యనారాయణ ఆధ్వర్యంలో క్యాలెండర్లను విడుదల చేసి సభ్యులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు సుధాకర్, వీర గాని వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.