VIDEO: నంద్యాలలో స్పటిక లింగేశ్వరునికి రుద్రాభిషేకం
NDL: కార్తీక సోమవారం సందర్భంగా నంద్యాల పట్టణంలోని అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎన్జీఓస్ కాలనీలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో స్పటిక లింగేశ్వరునికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.