బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేస్తామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని చట్ట పరంగా విచారించి చర్యలు చేపడతామన్నారు.