రేపు ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

రేపు ఉమ్మడి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు

ADB: జిల్లా కేంద్రంలో సోమవారం విద్యుత్ ఉద్యోగులకు ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్ఈ జైవంత్ రావ్ చౌహన్ తెలిపారు. భుక్తాపూర్‌లోని శాఖ అతిథి గృహంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు క్యారమ్, డైట్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాలీబాల్ పోటీలుంటాయని పేర్కొన్నారు.