VIDEO: గంట వ్యవధిలో 25 పైగా కేసులు నమోదు

VIDEO: గంట వ్యవధిలో 25 పైగా కేసులు నమోదు

AKP: నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం సాయంత్రం టౌన్ ఎస్సై ఉమామహేశ్వరరావు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేశారు. త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, లైసెన్సు, రికార్డులు లేని వాహనదారులపై గంట వ్యవధిలో 25కు పైగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.