VIDEO: గన్నవరంలో విద్యార్థులకు ఆటల పోటీలు

కృష్ణా: గన్నవరం మండలంలో పలు పాఠశాలల, కళాశాలలో స్వాతంత్య్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం గన్నవరం వీకేర్ కాలేజీలో విద్యార్థులకు పలు ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేయనున్నారు. ఈ ఆటల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.