'ఆడపిల్లల సంరక్షణ పథకం నిధులు మంజూరు చేయాలి'
VZM: ఆడపిల్లల సంరక్షణ పథకం నిధులు మంజూరు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు డిమాండ్ చేశారు. నెల్లిమర్లలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2005లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేశారని చెప్పారు. పథకం అమలుకు ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని బాండ్లు జారీ చేసిందన్నారు.