VIDEO: సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
KKD: పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక ఆర్థిక భరోసా అని, పేద కుటుంబాలు వైద్యం కోసం దరఖాస్తు చేసిన వెంటనే సీఎం నిధులు మంజూరు చేస్తున్నారని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. జగ్గంపేటలోని స్థానిక రావులమ్మ నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో బుధవారం 98మంది లబ్ధిదారులకు రూ. 54 లక్షల 92 వేల రూపాయల సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.