ఆర్టీసీ డిపో నందు మహిళా దినోత్సవ వేడుకలు
WNP: నేటి సమాజంలో ప్రతి రంగం అభివృద్ధి సాధించడంలో మహిళలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. ఆదివారం వనపర్తి ఆర్టీసీ డిపో నందు మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో మహిళ కండక్టర్ల పాత్ర ఎనలేనిది అన్నారు. అనంతరం సిబ్బందిని అభినందించారు.