మున్సిపాలిటీ ఎదుట సీపీఐ ధర్నా
ATP: గుత్తి మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ పట్టణ, మండల కార్యదర్శిలు రాజు, రామదాసు మాట్లాడుతూ.. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, దోమల బెడద ఎక్కువగా ఉందన్నారు. వాటిని పరిష్కరించాలని కోరుతు వినతి పత్రం అందించారు.