బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్‌ మండలం షాంపూర్‌లో అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైతే వారిని రిమ్స్‌కు తరలించాలన్నారు.