VIDEO: MJP పాఠశాలల్లో ఫోన్ సౌకర్యం
AKP: నర్సీపట్నం మహాత్మ జ్యోతిరావు పూలే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫోన్ సదుపాయం కల్పించారు. పాఠశాలలో ఆరు ఫోన్లు ఏర్పాటు చేశారు. ఫోన్లకు ప్రత్యేకంగా రీఛార్జ్ కార్డు ఉంటుంది. విద్యార్థులు 100 రూపాయలకు కార్డు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కేవలం మూడు ఫోన్ నెంబర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది.