ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

KMM: మధిర శివాలయం వైరా నది వద్ద ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం చొప్పరకట్లపాలెం గ్రామానికి చెందిన కృష్ణ మధిరలో సెంట్రింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజు ఈతకు వెళ్లే అలవాటు ఉండడంతో ఉదయం వెళ్లిన అతను లోతైన ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేక నదిలో నీట మునిగి మరణించాడు.