'విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కారించాలి'
WGL: రంగశాయిపేట డివిజన్‌లోని విద్యుత్తు సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతామని 40 డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి హెచ్చరించారు. గురువారం ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మిల్స్ కాలనీ ఎస్సై శ్రవణ్ కుమార్ ఆందోళనకారులకు సర్ది చెప్పి ధర్నా విరమింపచేశారు.