జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో ఆదివారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కౌన్సిలర్ మబ్బు రామరాజు క్రీడలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.