హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల జడ్జిల బదిలీ

HNK: హన్మకొండ, భూపాలపల్లి జిల్లాల జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండ ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి సీహెచ్ రమేశ్ బాబును జయశంకర్ భూపాలపల్లికి బదిలీ చేశారు. భూపాలపల్లి ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి నారాయణబాబు వరంగలకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా ఇద్దరు జిల్లా జడ్జిలకు బదిలీ జరిగింది.