ఫుడ్ పాయిజన్.. 29 మంది విద్యార్థులకు అస్వస్థత
AP: అల్లూరి జిల్లాలోని ఓ గిరిజన స్కూల్లో గురువారం సాయంత్రం ఫుడ్ పాయిజన్ జరిగింది. జెర్రెల గిరిజన ఆశ్రమ పాఠశాలలో రాత్రి భోజనం చేసిన విద్యార్థులంతా వాంతులు చేసుకొని, కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. వారిలో 29 మంది విద్యార్థులకు సీరియస్ కావడంతో తక్షణమే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.