మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు
JGL: మల్లాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురువారం సందర్శించారు. 40 రోజులుగా మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని అధికారులపై మండిపడ్డారు. కాగా, ధాన్యం తూకం వేయటంలేదని ఈరోజు ఉదయం రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లాధ్యక్షుడు అక్కడికి చేరుకుని మాట్లాడారు.