అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

ప్రకాశం: వివిధ ప్రభుత్వ పథకాల అమలులో మున్సిపల్ కమిషనర్‌లు, మండల స్థాయి అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఒంగోలు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అసహనం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు అడిగిన వివరాలు చెప్పలేకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.