భానుడి భగభగ: 41డిగ్రీలకు చేరిన ఎండలు
ADB: జిల్లాలో రోజురోజుకి భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నేడు జిల్లాలో పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా బేల మండలంలో 40.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్ (అర్బన్)లో 40.5 ,సాత్నాలలో 40.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.