బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణంలో శనివారం జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనేత అని, దళితుల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.