జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్పీ
ములుగు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ రామ్‌నాథ్ కేకన్ మంగళవారం కలెక్టర్ దివాకర టీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఛాంబర్లో ఆయన పూల మొక్కను అందించారు. అనంతరం ఎస్పీకి కలెక్టర్ అభినందనలు తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి జరగబోయే మేడారం మహా జాతర సందర్భంగా విజయవంతంపై వారు చర్చించారు.